కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 02 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి రా. 10.47 కు తదుపరి దశమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ధనిష్ఠ రా. 11.07 కు తదుపరి శతభిషం
యోగం: శుక్ల సా. 05.19 కు తదుపరి బ్రహ్మ
కరణం: తైతుల మ. 02.59 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 - 10.57 కు & మ. 03.12 - 04.03 కు
వర్జ్యం: తె. 5.51 - 7.21 కు
అమృతకాలం: మ. 1.20 - 2.50 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు
గురుబోధ:
మాటవరుసకి కూడా మహాత్ములలో లోపలను ఎత్తిచూపకూడదు. మహాత్ములు చేసే పనులు లోపములుగా కనిపించినప్పటికీ అవి సరిదిద్దుకోగలిగే జ్ఞానులు వారు. శంకరవిజయము ఆధారముగా, శంకరభగవత్పాదులు మరియు వారి శిష్యుల మధ్య జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఒకసారి శంకురులవారు మద్యమును స్వీకరించారు, అది చూసి వారి శిష్యులు కూడా మరునాడు గురువును అనుకరిస్తూ కల్లు తాగారు. అది తెలిసిన శంకరులు మరునాడు కరిగించిన సీసమును కుండతో తాగగా, గురువుగారిని అనుకరిస్తున్న శిష్యులు మాత్రము నిశ్చేష్టులై చూస్తున్నారు. వారిని చూసి శంకరులు అన్ని వేళలా గురువుని అనుకరించడమన్నది తగదు. గురువులు చెప్పే మంచిని మాత్రమే స్వీకరించాలి అని వారికి జ్ఞానబోధ చేసారు.