May 02 2023మే 02 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము

తిథి : ద్వాదశి రా. 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : ఉత్తర రా. 06గం౹౹35ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : వ్యాఘాత ఉ. 11గం౹౹50ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం :  బవ ఉ. 10గం౹౹48ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & రా. 10గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹48ని౹౹ నుండి 12గం౹౹31ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈ రోజు చెయ్యాలి.

గురుబోధ
ఆలయాల ప్రాంగణంలో ఫల, పుష్ప వృక్షాలు పెంచడం, ప్రాంగణాన్ని శుభ్రం చేయడం, ప్రదక్షిణలు చేయడం వంటివి భౌతిక ఉపాసన. ఈ భౌతిక ఉపాసనలు లేకుండా పూర్తి పారమార్థిక ఉపాసనలోకి ఎప్పటికీ వెళ్ళలేము. ఆలయప్రాంగణాన్ని శుచిగా శుభ్రంగా చేసేవారు రాబోయే జన్మలో సంపన్నులు అవుతారు. ఆలయాలను శుభ్రం చేస్తూ, పండితులను సేవిస్తూ, వారివద్దే విద్యాభ్యాసం చేస్తూ, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, పురాణశ్రవణం చేసేవారు నారదుని స్థాయిని పొందుతారు. ఉపాసనల్లొ వీటన్నింటినీ దివ్యోపాసనలుగా భావించాలి. 

expand_less