May 01 2026మే 01 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ రా.9.28 కు తదుపరి బ.పాడ్యమి 2 రా.11.01 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి 2 తె.3.26 కు తదుపరి విశాఖ 3 తె.5.38 కు
యోగం: వ్యతీపాత రా.9:44 కు తదుపరి వరీయాన్ 2 రా.10:27 కు
కరణం: బవ రా.10:53 కు తదుపరి కౌలవ 2 రా.12:50 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.25 - 9.16 కు, మ. 12.38 - 1.29 కు
వర్జ్యం: ఉ.7.37 - 9.21 కు
అమృతకాలం: సా. 06.55 - 08.41 కు
సూర్యోదయం: ఉ. 5.54 కు
సూర్యాస్తమయం: సా. 6.32 కు

🕉️ మహావైశాఖి, వైశాఖపూర్ణిమ 🕉️

గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు పూర్ణిమ తిథి వచ్చినప్పుడు లక్ష్మీఆవిర్భావం, లక్ష్మీనారాయణుల వివాహఘట్టం వినడం సకలశుభప్రదం, సర్వసంపత్ప్రదాయకం.
https://www.youtube.com/watch?v=oIlCRzW-Qdc&list=PLfgDt5ZsV1JK7ZJl92EnRT2tjvDejx-oT
శ్లో|| వైశాఖ్యామపి పూర్ణాయాం, దానం సర్వస్వ సర్వదమ్|
ధర్మరాజ వ్రతం చాత్ర కథితం తన్నిశామయ||
వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన పూర్ణిమ. ఈనాడు యమధర్మరాజును భక్తితో పూజించి నీటితో నింపిన పాత్రను శక్తిని బట్టి వెండి, రాగి లేక మట్టిది దానం చేసిన వారికి గోదానఫలం లభిస్తుంది. ధర్మజ్ఞానము కలుగుతుంది. అన్నదానం చేసిన వానికి భూదానఫలితం లభిస్తుంది. ఈ వ్రతాచరణ చేసినవాడు యముని చేత గౌరవింపబడతాడు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less