May 01 2024మే 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 01 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: అష్టమి రా. 12.56 కు తదుపరి నవమి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శ్రవణం రా. 12.29 కు తదుపరి ధనిష్ఠ
యోగం: శుభ రా. 08.02 కు తదుపరి శుక్ల
కరణం: బాలవ మ. 04.56 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.48 - 12.39 కు
వర్జ్యం: తె. 4.15 - 6.56 కు
అమృతకాలం: మ. 2.36 - 4.07 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.37 కు

🕉️ నర్మదా పుష్కరములు ప్రారంభం, బుధాష్టమి 🕉️

గురుబోధ:
సరస్వతీ జలం మూడు రోజులలో పవిత్రం చేస్తుంది. యమునా జలం ఏడు రోజులలో పవిత్రం చేస్తుంది. గంగాజలం తనలో స్నానం చేసిన వాడిని పవిత్రుని చేస్తుంది. కానీ నర్మద, దర్శన మాత్రంతో మనిషిని పవిత్రం చేస్తుంది. నర్మదా సంగమంలో (ఈ సంగమము ఓంకార క్షేత్రం దగ్గర ఉంది) స్నాన, దాన, జప, హోమ, వేదపాఠ, పితృపూజన, దేవతారాధన, మంత్రోపదేశ, సన్యాసదీక్ష చెప్పలేనంత ఫలితాన్ని ఇస్తాయి.

బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.

https://www.youtube.com/watch?v=U4KPeiHGdlE&pp=ygUfYnVkaGFzaHRhbWkgdmFkZGlwYXJ0aSBwYWRtYWthcg%3D%3D

expand_less