May 01 2023మే 01 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 01 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము

తిథి : ఏకాదశి రా. 08గం౹౹38ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : పుబ్బ సా. 04గం౹౹41ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : ధృవ ఉ. 11గం౹౹45ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  వణిజ ఉ. 09గం౹౹22ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : రా. 12గం౹౹27ని౹౹ నుండి 02గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 09గం౹౹39ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

🕉️వైశాఖ శుద్ధ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము మంగళవారం చెయ్యాలి.


గురుబోధ
వైశాఖమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి మోహిని అని పేరు. మోహినీతిథి చాలా గొప్ప తిథి. ఎప్పుడూ ఏకాదశినాడు స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని స్నానము చెయ్యాలి. సంకల్పవిహీన స్నానము వలన రావలసినంత ఫలితము రాదు అని శాస్త్రము. ఇవి మంత్రశాస్త్ర నియమాలు. శక్తిని అనుసరించి ఉపవాసం ఉండడం, తర్వాత దానం చేయటం మంచిది. కనుక స్వయంపాకం, స్వర్ణము, వెండి, వస్త్రాలు మొదలగునవి దానం చేయటం మంచిది. మోహినీతిథి నాడు గురుపత్నికి గాని, అర్చకుల పత్నులకు గాని, మీ పురోహితుల భార్యలకు కానీ ఒక మంచి చీరను దానము చేస్తే మోహినీ రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండటం మంచిది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less