"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 01 2022🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: పాడ్యమి ఈ రోజు రాత్రి 01గం౹౹54ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం: భరణి ఈ రోజు రాత్రి 09గం౹౹08ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం: ఆయుష్మాన్ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : కింస్తుఘ్న ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹36ని౹౹ నుండి05గం౹౹26ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 05గం౹౹52ని౹౹ నుండి 07గం౹౹33ని౹౹ వరకు అమృతకాలం: మధ్యాహ్నం 03గం౹౹54ని౹౹ నుండి 05గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు గురుబోధ: శ్రీ వాల్మీకి రామాయణం లేదా సుందరకాండము లోని శ్లోకములను (రోజుకు కొన్ని శ్లో౹౹ చొప్పున) పుస్తకములో వ్రాసిన వారికి తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఫలశ్రుతి. - శ్రీ మద్రామాయణం