March 31 2026మార్చి 31 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 31 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి ఉ.6.50 కు తదుపరి చతుర్దశి 01 ఉ.6.28 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుబ్బ ఉ.3.19 కు తదుపరి ఉత్తర 01 మ.3.48 కు
యోగం: వృద్ధి మ.2:50 కు తదుపరి ధ్రువ 01 మ.2:19 కు
కరణం: గరజి రా.6:58 కు తదుపరి విష్టి 01 రా.7:21 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.41 - 9.29 కు, రా. 11.09 - 11.56 కు
వర్జ్యం: రా.10.39 - 12.17 కు
అమృతకాలం: ఉ. 08.46 - 10.25 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు

🕉️ మహావీర్ జయంతి 🕉️

గురుబోధ:
భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు.
శ్లో౹౹ ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ |
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి ||

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less