కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 31 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం తిథి: షష్ఠి సా. 5.17 కు తదుపరి సప్తమి వారం: భానువారము (ఆదివారం) నక్షత్రం: జ్యేష్ఠ రా. 7.08 కు తదుపరి మూల యోగం: వ్యతీపాత రా. 09.53 కు తదుపరి వరీయాన్ కరణం: గరజి ఉ. 08.26 కు తదుపరి వణిజ రాహుకాలం: సా. 04.30 - 06.00 కు దుర్ముహూర్తం: సా. 04.51 - 05.40 కు వర్జ్యం: తె. 3.06 - 4.42 కు అమృతకాలం: ఉ. 10.15 - 11.52 కు సూర్యోదయం: ఉ. 6.11 కు సూర్యాస్తమయం: సా. 6.29 కు గురుబోధ: శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు. ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.