కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 30 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి ఉ.7.39 కు తదుపరి త్రయోదశి 31 ఉ.6.50 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మఘ మ.3.18 తదుపరి పుబ్బ 31 ఉ.3.19 కు
యోగం: గండ మ.3:41 కు తదుపరి వృద్ధి 31 మ.2:50 కు
కరణం: కౌలవ రా.7:00 కు తదుపరి గరజి 31 రా.6:58 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.44 - 1.33 కు, మ. 3.10 - 3.59 కు
వర్జ్యం: రా.11.18 - 12.54 కు
అమృతకాలం: మ. 12.21 - 01.58 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం 7.30 లోపే చేసెయ్యాలి.
🕉️ ప్రదోషము 🕉️
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఈ రోజు చేసిన స్త్రోత్రము, పూజ, అభిషేకం విశేష ఫలితం ఇస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial