కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 30 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం తిథి: పంచమి సా. 5.30 కు తదుపరి షష్ఠి వారం: స్థిరవారము (శనివారం) నక్షత్రం: అనూరాధ సా. 6.44 కు తదుపరి జ్యేష్ఠ యోగం: సిద్ధి రా. 10.47 కు తదుపరి వ్యతీపాత కరణం: కౌలవ ఉ. 08.51 కు తదుపరి తైతుల రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు దుర్ముహూర్తం: ఉ. 06.12 - ఉ. 07.50 కు వర్జ్యం: రా. 12.25 - 2.03 కు అమృతకాలం: ఉ. 08.01 - 09.40 కు సూర్యోదయం: ఉ. 6.12 కు సూర్యాస్తమయం: సా. 6.29 కు గురుబోధ: మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయ దర్శనం, పురాణ ప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఎదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి.