March 30 2023మార్చి 30 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : నవమి రా. 11గం౹౹52ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పునర్వసు రా. 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : అతిగండ  (31వ తేదీ) రా. 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  బాలవ  ఉ. 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹01ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు & మ. 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹19ని౹౹ నుండి 12గం౹౹04ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹02ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

🕉️👉శ్రీ రామనవమి👈🕉️

గురుబోధచైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు కౌసల్యా దశరథులకు & జగన్మాత పార్వతీదేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి. - శ్రీ శివ మహాపురాణంఇదే రోజు1608 వ సం౹౹ రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మించారు. వీరే ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. వీరు రచించిన "దాసబోధ" శివాజీ మహరాజ్ గారికి నిత్యపారాయణ గ్రంథం. సమర్థ రామదాస స్వామి వారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.శ్రీ మహావిష్ణువు  యొక్క దశావతారాలలో శ్రీ రామవతారం 7వది. ఈ రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:  
1) శ్రీ రామచంద్రప్రభువుని యథాశక్తి శ్రీసూక్తం, పురుషసూక్తంతో అర్చన ; 2) శ్రీ రామునికి అష్టోత్తరశతనామావళితో పూజ ; 3) శ్రీ రాముని తులసీదళాలతో అర్చించడం, రామనామజపం ; 4) శ్రీ రామరక్షాస్తోత్రం లేదా సంక్షిప్త రామాయణం పారాయణం ; 5) ఆలయదర్శనం, గురువులకి నమస్కారములు, గుడిలో ప్రదక్షిణలు


expand_less