March 29 2026మార్చి 29 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 29 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: ఏకాదశి ఉ.8.55 కు తదుపరి ద్వాదశి 30 ఉ.7.39 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆశ్లేష మ.3.43 కు తదుపరి మఘ 30 కు.3.18 కు
యోగం: శూల సా.4:51 కు తదుపరి గండ 30 మ.3:41 కు
కరణం: బవ రా.7:25 కు తదుపరి కౌలవ 30 రా.7:00 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.47 - 5.36 కు
వర్జ్యం: తె.3.30 - 5.06 కు
అమృతకాలం: మ. 01.01 - 02.36 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కు

🕉️ ఏకాదశి, శుక్రజయంతి 🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ద్వాదశీ పారణ రేపు ఉదయం 7.30 లోపే చేసెయ్యాలి.

గురుబోధ:
🕉️శుక్ర గ్రహ ధ్యాన శ్లోకం!
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుమ్ ||
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహమ్ ||
🕉️ఏకాదశీ తిథి శ్రీమహావిష్ణు స్వరూపము. లక్ష్మీ నారాయణులను వాసుదేవ శతనామావళితో గాని, విష్ణుసహస్రనామంతో గాని భక్తిశ్రద్ధలతో పూజించినవారు సకలశుభాలు పొందుతారు. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. గురుదర్శనం, గురుస్మరణం వలన సర్వపాపహరణమై హరికటాక్షం సులభంగా లభ్యమవుతుంది. పరమపవిత్రమైన ఏకాదశీ ఘడియలలో లక్ష్మీనారాయణులను యథాశక్తి అర్చిస్తూ, విష్ణుస్తోత్రాలను విన్నా, పారాయణం చేసినా సకలశుభఫలితాలు పొందుతారు.

https://youtu.be/DpjBm71jA_s?si=4C8_D5qUsHCFHAv1

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less