కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 29 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: ఫాల్గున అమావాస్య సా.5.14 కు తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి 30 సా.4.31 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.19 కు తదుపరి రేవతి 30 సా.6.43 కు
యోగం: బ్రహ్మ రా.10:03 కు తదుపరి ఐంద్ర సా.5:53 కు
కరణం: చతుష్పాద ఉ.6.13 కు తదుపరి నాగ సా.4.27 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:53-8:42 కు
వర్జ్యం: ఉ.6.47-8.17 కు
అమృతకాలం: మ. 03:11 - 04:36 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు
🕉️ ఫాల్గున అమావాస్య, యుగాది అమావాస్య🕉️
గురుబోధ:
ఫాల్గున మాసంలో అమావాస్య నాడు విప్రులకు భోజనము పెట్టినా పితృదేవతలను తలచుకొని వారి ప్రీతికై స్వయంపాకాదులు దానం చేసినా వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ పని పసివారి నుండి ముసలివారి వరకూ అందరూ చేయవచ్చును. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. అమావాస్య నాడు రాహుకాలం సమయంలో శివలింగదర్శనం, శివాభిషేకం అత్యంత శుభప్రదం, ఆరోగ్యదాయకం. శివపంచాక్షరీ స్తోత్రం శ్రవణం చేయడం, పారాయణం చేయడం సకలపుణ్యప్రదం.