కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 29 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము కృష్ణపక్షం తిథి: చతుర్థి సా. 5.14 కు తదుపరి పంచమి వారం: భృగువారము (శుక్రవారం) నక్షత్రం: విశాఖ సా. 5.52 కు తదుపరి అనూరాధ యోగం: వజ్ర రా. 11.12 కు తదుపరి సిద్ధి కరణం: బవ ఉ. 07.42 కు తదుపరి బాలవ రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు దుర్ముహూర్తం: ఉ. 08.40 - 09.29 కు & మ. 12.45 - 01.34 కు వర్జ్యం: రా. 10.00 - 11.40 కు అమృతకాలం: రా. 8.37 - 10.18 కు సూర్యోదయం: ఉ. 6.13 కు సూర్యాస్తమయం: సా. 6.29 కు గురుబోధ: అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది.