" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 29 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : అష్టమి రా. 10గం౹౹03ని౹౹ వరకు తదుపరి నవమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : ఆర్ద్ర రా. 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : శోభన (30వ తేదీ) రా. 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : విష్టి ఉ. 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹39ని౹౹ నుండి 06గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 10గం౹౹19ని౹౹ నుండి 12గం౹౹03ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹02ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు 🕉️👉 బుధాష్టమీ పర్వదినం👈🕉️ గురుబోధ ◆చైత్ర శుక్ల అష్టమీ తిథి నాడు మారేడు దళాలతో శివుడ్ని పూజిస్తే అష్టసిద్ధులూ లభిస్తాయి. ◆ చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు అవతరించాడు మరియు జగన్మాత పార్వతీ దేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి కూడా అదే. - శ్రీ శివ మహాపురాణం ◆ చైత్ర శుక్లపక్ష నవమీతిథి (1608 వ సం౹౹) నాడే రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాసు గారు జన్మించారు. వీరు ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. శివాజీ మహరాజ్ గారి నిత్యపారాయణ గ్రంథం శ్రీ సమర్థ రామదాసు గారు రచించిన "దాసబోధ" సమర్థ రామదాసు గారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.