March 28 2022మార్చ్ 28 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 28 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: ఏకాదశి ఈ రోజు సాయంత్రం 04గం౹౹28ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (29) మధ్యాహ్నం 02గం౹౹42ని౹౹ వరకు
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం: శ్రవణ  మధ్యాహ్నం 12గం౹౹47ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం:  సిద్ధ ఈ రోజు సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం  : బాలవ   ఈ రోజు సాయంత్రం 04గం౹౹15ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹19ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం: సాయంత్రం 04గం౹౹36ని౹౹ నుండి 06గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 01గం౹౹47ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹05ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹07ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయాలి.

గురుబోధ*: 
ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్యవంతులకు ఈ పై నియమాలు లేవు.
expand_less