March 27 2026మార్చి 27 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 27 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: నవమి మ.12.31 కు తదుపరి దశమి 28 ఉ.10.35 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పునర్వసు సా.5.41 కు తదుపరి పుష్యమి 28 సా.4.33 కు
యోగం: అతిగండ రా.10:09 కు తదుపరి ధృతి 28 సా.6:19 కు
కరణం: తైతుల రా.9:24 కు తదుపరి వణిజ 28 రా.8:13 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.43 - 9.32 కు, మ. 12.45 - 1.34 కు
వర్జ్యం: ఉ.6.23 - 7.53 కు, రా.1.19 - 2.50 కు
అమృతకాలం: మ. 01.44 - 03.16 కు
సూర్యోదయం: ఉ. 6.18 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు

🕉️ శ్రీ రామనవమి, శ్రీ సమర్థరామదాసు జయంతి, శ్రీపార్వతీమాత అవతరణము 🕉️

గురుబోధ:
🕉️◆చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామనవమి - శ్రీరాముడు కౌసల్యా దశరథులకు మరియు జగన్మాత పార్వతీదేవి మేనా హిమవంతులకు జన్మించిన పవిత్ర తిథి. - శ్రీ శివ మహాపురాణం
🕉️◆ ఇదే రోజు1608 వ సం౹౹ రాణుబాయికి, సూర్యాజీపంతునకు శ్రీ సమర్థ రామదాస స్వామి జన్మించారు. వీరే ఛత్రపతి శివాజీ మహరాజ్ కి గురువులు. వీరు రచించిన "దాసబోధ" శివాజీ మహరాజ్ గారికి నిత్యపారాయణ గ్రంథం. సమర్థ రామదాస స్వామి వారిని హనుమద్ అవతారం గా కీర్తిస్తారు.
🕉️◆శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో శ్రీ రామవతారం 7వది. ఈ రోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైనవి:
1) శ్రీ రామచంద్రప్రభువుని యథాశక్తి శ్రీసూక్తం, పురుషసూక్తంతో అర్చించడం ; 2) శ్రీ రామునికి అష్టోత్తరశతనామావళితో పూజ ; 3) శ్రీ రాముని తులసీదళాలతో అర్చించడం, రామనామజపం ; 4) శ్రీ రామరక్షాస్తోత్రం లేదా సంక్షిప్త రామాయణం లేదా శ్రీ రామ పట్టాభిషేక ఘట్టం పారాయణం; 5) ఆలయదర్శనం, గురువులకి నమస్కారములు, గుడిలో ప్రదక్షిణలు; 6) హనుమాన్ చాలీసా పారాయణం; 7) భక్తిశ్రద్ధలతో యథాశక్తి దానం
🕉️◆ఈ రోజు మనం చేసిన స్తోత్ర పారాయణ, జపం, దానము విశేష ఫలితం ఇస్తుంది అని శాస్త్రం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less