కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 27 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం తిథి: విదియ మ. 3.10 కు తదుపరి తదియ వారం: సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: చిత్త మ. 2.39 కు తదుపరి స్వాతి యోగం: వ్యాఘాత రా. 10.54 కు తదుపరి హర్షణ కరణం: గరజి సా. 05.06 కు తదుపరి వణిజ రాహుకాలం: మ. 12.00 - 01.30 కు దుర్ముహూర్తం: ఉ. 11.57 - 12.46 కు వర్జ్యం: రా. 8.40 - 10.24 కు అమృతకాలం: ఉ. 7.55 - 9.29 కు సూర్యోదయం: ఉ. 6.15 కు సూర్యాస్తమయం: సా. 6.28 కు గురుబోధ: దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు. పాపాలు కర్మను అనుసరిస్తాయి. మరలా మరలా కర్మలు చేసేలా జీవుడ్ని ప్రేరేపిస్తాయి. ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలికకాదు. పోతనభాగవతంలో “తనువులు పెక్కైన చెడవు తనకర్మంబుల్” అంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కర్మబంధాల నుండి మాత్రం బయటపడలేక జీవులు నానాయాతనలు పడుతుంటారు. ఈ కర్మఫలాలు తొలగించి సకలదుఃఖవినాశనం చేసే దివ్య మాసం ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి