కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 26 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి మ.2.42 కు తదుపరి నవమి 27 మ.12.31 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆర్ద్ర రా.7.05 కు తదుపరి పునర్వసు 27 సా.5.41 కు
యోగం: శోభన రా.12:31 కు తదుపరి అతిగండ 27 రా.10:09 కు
కరణం: బవ ఉ.11:49 కు తదుపరి తైతుల 27 రా.9:24 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.21 - 11.09 కు, మ. 3.11 - 3.59 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 06.49 - 08.20 కు
సూర్యోదయం: ఉ. 6.19 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు
గురుబోధ:
పురాణములు పండితులకు, భక్తులకు దానం ఇవ్వడము, పిల్లల చేత ఇప్పించడం ఎంతో పుణ్యము. అక్షరాభ్యాసం నాడు తప్పక పిల్లలచేత పురాణములు, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పించాలి. వ్యాసానుగ్రహం లేనిదే అష్టాదశ పురాణములు సంపూర్ణంగా శ్రవణం చేసే భాగ్యం అందరికీ కలగదు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial