March 26 2023మార్చి 26 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : పంచమి రా. 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : కృత్తిక సా. 04గం౹౹34ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : ప్రీతి  రా. 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  బాలవ  సా. 04గం౹౹32ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 02గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹05ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹07ని౹౹కు

 గురుబోధ 
మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజూ పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయదర్శనం, పురాణప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజూ వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించుకోవాలి, అప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో పరిణితి గురుకటాక్షంతో లభిస్తుంది.

expand_less