" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 25 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : చతుర్థి రా. 07గం౹౹01ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : భరణి మ. 03గం౹౹58ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం : విష్కంభ (26) రా 12గం౹౹20ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : విష్టి సా. 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹06ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹16ని౹౹ నుండి 05గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 10గం౹౹58ని౹౹ నుండి 12గం౹౹34ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹06ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹07ని౹౹కు గురుబోధ పురీ క్షేత్రమును నీలాచలక్షేత్రం అని కూడా అంటారు, కలియుగంలో ఈ పర్వతంపై అడుగుపెడితే మహాపాపాలుపోయి, ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే అదృష్టం లభిస్తుంది. క్షేతానికి 4 ద్వారాలుంటాయి. సింహ,గజద్వారాలప్రవేశం అత్యధికఫలం, మధ్యాహ్నం 12లోపు స్నానం, అవభృతస్నానఫలం ఇస్తుంది, క్షేత్రంలో దిగగానే నమస్కరిస్తే తక్షణమే భూదేవి అనుగ్రహం కల్గుతుంది. భూదేవి స్తనములలో ఒకటి జగన్నాథపురం, రెండవది బదరి.