కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 24 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి రా.7.24 కు తదుపరి సప్తమి 25 సా.4.58 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రోహిణి రా.10.16 తదుపరి మృగశిర 25 రా.8.36 కు
యోగం: ఆయుష్మాన్ ఉ.6:01 కు తదుపరి సౌభాగ్య 25 తె.3:09 కు
కరణం: తైతుల సా.4:08 కు తదుపరి వణిజ 25 మ.1:50 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.45 - 9.33 కు, రా. 11.10 - 11.58 కు
వర్జ్యం: మ.2.50 - 4.19 కు, తె.3.28 - 4.58 కు
అమృతకాలం: సా. 04.06 - 05.35 కు
సూర్యోదయం: ఉ. 6.20 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు
🕉️ శృంగేరీ జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి జయంతి 🕉️
గురుబోధ:
శృంగేరీ శారదాపీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తెలుగువారు కావడం మన అదృష్టం. అనేక శృంగేరీ శారదాపీఠ ఆలయాలతో పాటు ప్రముఖంగా గుంటూరు శారదాపీఠంలో అనేకమంది పౌరాణికుల చేత పురాణాలను చెప్పిస్తుంటారు. అభినవశుక, ప్రవచననిధి, శ్రీ ప్రణవపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి ద్వారా అష్టాదశపురాణాలను భక్తులకు అందాలని సంకల్పించారు. అందులో భాగంగా శ్రీ మద్భాగవతం, శ్రీ మద్దేవీభాగవతం, శ్రీ మహాభారాతం, శ్రీమద్రామాయణం, మార్కండేయ పురాణం, హనుమద్ వైభవం, శ్రీ స్కాంద పురాణం, శ్రీ బ్రహ్మాండ పురాణం, శ్రీ విష్ణు పురాణం, శ్రీ శివమహాపురాణం వంటి పురాణాలను ఇప్పటికే భక్తులు శ్రవణం చేసి తరించారు. గురువుగారు రచించిన 'మా'నవకథ అనే పద్యకావ్యాన్ని గుంటూరులోనే ఆవిష్కరించేలా చేసారు. వారి దర్శనార్థం శృంగేరీ శారదాపీఠానికి విచ్చేసే భక్తులకు, ముఖ్యంగా పిల్లలకు సద్బుద్ధి కలిగేందుకు ఈ పద్యకావ్యాన్ని పారాయణ గ్రంథంగా కూడా అనుగ్రహించారు. అంతటి కారుణ్యస్వరూపులు, ప్రాతఃస్మరణీయులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు.
భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణమ్ |
భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే ||
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial