March 24 2024మార్చి 24 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 24 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి ఉ.  9.28 కు తదుపరి పౌర్ణమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుబ్బ ఉ.  7.21 కు తదుపరి ఉత్తర
యోగం: గండ రా.  08.34 కు తదుపరి వృద్ధి
కరణం: వణిజ ఉ.  08.54 కు తదుపరి విష్టి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ.  04.50 - 05.39 కు
వర్జ్యం: మ.  3.20 - 5.07 కు
అమృతకాలం: రా.  2.00 - 3.46 కు
సూర్యోదయం: ఉ.  6.17 కు
సూర్యాస్తమయం: సా.  6.28 కు

🕉️ హోలికోత్సవం - కామ దహనం🕉️

గురుబోధ:
“హోలిక” అనగా అవసరం. కామముల ద్వారా మనిషిలో విపరీతధోరణులు పెంచేది. మనస్సును పాడు చేయునది. వేద విరుద్ధ కర్మలద్వారా, జీవులచేత పాపకర్మములు చేయిస్తుంటుంది. అందుకే దాన్ని కామరాక్షసి అని కూడా అంటారు. అది తొలగితే జీవులు దుఃఖవిముక్తులవుతారు. ఫాల్గుణమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు శివాభిషేకం చేసి, పూర్ణిమనాడు శ్రీహరి భజన చేసే వారంతా అసురశక్తుల నుండి బయటపడి, దుఃఖవిముక్తులై, సర్వసౌఖ్యాలు పొందుతారు.

హోలీ పండుగ రోజు శివ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయాలి.



expand_less