" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 24 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : తదియ రా. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : అశ్విని మ. 03గం౹౹51ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : వైధృతి (25) రా 01గం౹౹43ని౹౹ వరకు తదుపరి విష్కంభ కరణం : గరజి సా. 04గం౹౹59ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు & మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 11గం౹౹54ని౹౹ నుండి 01గం౹౹28ని౹౹ వరకు & రా. 01గం౹౹29ని౹౹ నుండి 03గం౹౹05ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 08గం౹౹45ని౹౹ నుండి 10గం౹౹19ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹07ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు గురుబోధ లింగోద్భవకాలంలో అబద్ధసాక్ష్యం చెప్పిన బ్రహ్మ తలను గిల్లడం వల్ల కాలభైరవుడికి ఆ బ్రహ్మకపాలం చేతికి అంటుకున్నది. అది కాశీలోపడి దొర్లుతూ బదరీనారాయణుని పాదసన్నిధి అలకనందాతీరంలో పడింది. ఆదే బ్రహ్మకపాలక్షేత్రం. బదరీక్షేత్రంలో చేసే దాన,జప,తపాలు కోటానుకోట్ల సం.లు తపస్సు చేసిన ఫలం ఇస్తాయి.