March 23 2026మార్చి 23 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 23 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా.9.49 కు తదుపరి షష్ఠి 24 రా.7.24 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: కృత్తిక రా.11.58 కు తదుపరి రోహిణి 24 రా.10.16 కు
యోగం: ప్రీతి ఉ.9:07 కు తదుపరి ఆయుష్మాన్ 24 ఉ.6:01 కు
కరణం: బాలవ సా.6:38 కు తదుపరి తైతుల 24 సా.4:08 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.46 - 1.35 కు, మ. 3.11 - 3.59 కు
వర్జ్యం: మ.12.45 - 2.14 కు
అమృతకాలం: సా. 06.35 - 08.04 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు

🕉️ శ్వేతవరాహకల్పము, శ్రీ పంచమి, చైత్ర శుక్ల పంచమి (కృత్తికా నక్షత్రం) సంగీతత్రయంలోని శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ జయంతి 🕉️

గురుబోధ:
🕉️పిల్లలకు లౌకిక విద్యలతో పాటు బాల్యంలోనే మన ఆచారాలు, పురాణములు, సంగీత సాహిత్య కళలు ఇతర శాస్త్రముల మీద అవగాహన ఉండేట్లు చేయాలి. అవే వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి.
🕉️మానవ ప్రయత్నం చేసేటప్పుడు, ఆ ప్రయత్నానికి దైవబలం తోడు అవ్వకపోతే ఆ ప్రయత్నం సఫలీకృతం కాదు. మానవ ప్రయత్నానికి దేవతల అనుగ్రహం ఖచ్ఛితంగా లభిస్తేనే ప్రయత్నం సఫలం అవుతుంది. దేవతల అనుగ్రహం మంత్రం ద్వారా సిద్ధిస్తుంది. ఈ దేవతానుగ్రహాన్ని మంత్రం ద్వారా మనకు అందించే వారే గురువు. గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. మంత్రోపదేశం చేసినవారు మాత్రేమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రేమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా గురుధిక్కారంతో నశించిపోతుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less