March 22 2024మార్చి 22 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 22 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: త్రయోదశి పూర్తి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఘ తె.  4.50 కు తదుపరి పుబ్బ
యోగం: ధృతి సా.  06.36 కు తదుపరి శూల
కరణం: కౌలవ సా.  05.59 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  08.44 - 09.33 కు & మ.  12.47 - 01.36  కు
వర్జ్యం: మ.  3.40 - 5.25 కు
అమృతకాలం: రా.  2.07 - 3.52 కు
సూర్యోదయం: ఉ.  6.19 కు
సూర్యాస్తమయం: సా.  6.27 కు

గురుబోధ:
22వ తారీఖు తె. 04:44 నుండీ 23వ తారీఖు ఉ. 07:17 వరకు త్రయోదశి వుంది. అందువల్ల 22 , 23 రెండు రోజులూ తిథి త్రయోదశి అవుతుంది. ఫాల్గుణ శుక్ల త్రయోదశి మహాబలవంతులైన  భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించిన తిథి. మన్మధుడిని శివుడు తన మూడోకంటితో దహించిన రోజు. శివ స్తోత్రాలు చేసుకోవడం, శివాలయ దర్శనం వల్ల శుభం.

శివసహస్రనామ స్తోత్రమ్👇

 
expand_less