March 22 2023మార్చి 22 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : పాడ్యమి రా. 09గం౹౹49ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర సా. 04గం౹౹58ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : శుక్ల  ఉ. 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  కింస్తుఘ్న  ఉ. 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹45ని౹౹ నుండి 12గం౹౹33ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹36ని౹౹ నుండి 06గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹52ని౹౹ నుండి 02గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹08ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

👉🕉️ శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది  యుగాది, వసంత నవరాత్రులు ప్రారంభం🕉️👈

 గురుబోధ 
యుగాది రోజున తప్పక చేయవలసిన పనులు:* 1) సూర్యోదయానికి ముందు లేచి నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకుని అభ్యంగన స్నానం, 2) ఇష్టదేవతారాధనతో పాటు తప్పక లక్ష్మీదేవి పూజ, 3) శ్రీసూక్తం పారాయణం చేయడం లేక వినడం, 4) రుద్రాభిషేకం, 5) వేపపూతతో చేసిన షడ్రుచుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టి గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించడం, 5) ఆలయదర్శనం, 6) సూర్యుడు అస్తమించే లోపు పంచాంగశ్రవణం, 7) అన్నదానం, 8) గురుదర్శనం, 9) గురుప్రదక్షిణ, 10) వ్యాస భగవానుడి కథ వినడం, 11) సంధ్యాసమయంలో లక్ష్మీదేవికి దీపారాధన లేదా దీప దర్శనం, 12) గోప్రదక్షిణ మఱియు గోపూజ,13) పురాణశ్రవణం 14) మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం వంటివి అన్నీ చేయడం ఎంతో ఉత్తమం మరియు సకలశుభప్రదం.

expand_less