కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 21 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం తిథి: ద్వాదశి 22వ తేదీ తె. 5.36 కు తదుపరి త్రయోదశి వారం: బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: ఆశ్లేష రా. 2.30 కు తదుపరి మఘ యోగం: సుకర్మ సా. 05.42 కు తదుపరి ధృతి కరణం: బవ మ. 03.31 కు తదుపరి బాలవ రాహుకాలం: మ. 01.30 - 03.00 కు దుర్ముహూర్తం: ఉ. 10.22 - 11.10 కు & మ. 03.13 - 04.02 కు వర్జ్యం: మ. 2.22 - 4.06 కు అమృతకాలం: రా. 12.41 - 2.25 కు సూర్యోదయం: ఉ. 6.19 కు సూర్యాస్తమయం: సా. 6.27 కు ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి. గురుబోధ: పురాణశ్రవణము, యాత్రాఫలితం, మనం చేసే దానధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి. పురాణములు వినడమే కాదు, భక్తులకు వినిపించడం, వినేట్లు చేయడం గొప్ప భాగవత సేవ! ఇలా ఇతరులకు వినిపించి వారిని బాగుచేయాలనే తపన కలిగిన వారిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు.