" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 21 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి : అమావాస్య తె. 03గం౹౹46ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : పూర్వాభాద్ర సా. 06గం౹౹02ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం : శుభ మ. 12గం౹౹42ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : చతుష్పాద మ. 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి నాగ రాహుకాలం : ఉ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹34ని౹౹ నుండి 09గం౹౹22ని౹౹ వరకు & మ. 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు వర్జ్యం : తె. 03గం౹౹12ని౹౹ నుండి 04గం౹౹43ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 10గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹09ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు గురుబోధ :- పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఆ ఇంటిలో అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ బాగుంటుంది. పితృదేవతల అనుగ్రహము కలగాలంటే తప్పక చనిపోయిన తిథి నాడు ఆబ్దికము, ప్రతి అమావాస్య, సంక్రమణ మొ౹౹ రోజులలో తర్పణాలు, పితృపక్షం లో శ్రాద్ధం పెట్టడం చేయాలి.