March 21 2022మార్చ్ 21 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 21 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: తదియ ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి  రాత్రి 11గం౹౹19ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం:  వ్యాఘాత ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹55ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం  : విష్టి   ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ వరకు తదుపరి  బావ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 05గం౹౹55ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు & (22) తెల్లవారి 04గం౹౹38ని౹౹ నుండి 06గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹25ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు 


గురుబోధ: 

ఉప్పు, నువ్వులు, విభూతి మొ౹౹ ఇతరులకు ఇచ్చేప్పుడు చేతికి అందించరాదు. పక్కన ఎక్కడైనా పెట్టి తీసుకోమని చెప్పాలి.
expand_less