March 20 2025మార్చి 20 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 20 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి రా.10.46 కు తదుపరి సప్తమి 21 రా.11.54 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అనూరాధ రా.7.58 కు తదుపరి జ్యేష్ఠ 21 రా.9.49 కు
యోగం: వజ్ర సా.6:19 కు తదుపరి సిద్ధ 21 సా.6:41 కు
కరణం: గరజి మ.1.44 కు తదుపరి వణిజ రా.2.45 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:23-11:11 కు & మ. 3:11-3:59 కు
వర్జ్యం: రా.2.00-3.42 కు
అమృతకాలం: మ.11:57 - 01:44కు
సూర్యోదయం: ఉ. 6:09 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయ దర్శనం, పురాణ ప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఎదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి.

expand_less