కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 19 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: అమావాస్య ఉ.7.06 కు , శ్రీ పరాభవ చైత్ర శు.పాడ్యమి 20 తె.5.47 కు తదుపరి విదియ 21 తె.4.11 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర 20 తె.5.04 కు తదుపరి రేవతి 21 తె.4.10 కు
యోగం: శుక్ల రా.1:16 కు తదుపరి బ్రహ్మ 20 రా.10:14 కు
కరణం: కింస్తుఘ్న సా.5:56 కు తదుపరి బాలవ 20 మ.3:44 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.24 - 11.12 కు, మ. 3.11 - 3.59 కు
వర్జ్యం: మ.2.58 - 4.32 కు
అమృతకాలం: రా. 11.31 - 01.02 కు
సూర్యోదయం: ఉ. 6.24 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు
🕉️ యుగాది అమావాస్య, శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది, పద్మకయోగము, తైలాభ్యంగనం, శ్వేత వరాహ కల్పాది, ఉగాది పచ్చడి స్వీకరణ, పంచాంగశ్రవణం తప్పనిసరి🕉️
గురుబోధ:
యుగాది నాడు చేయవలసిన పనులలో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. పంచాంగం విన్నవారు, వినడానికి ఏర్పాట్లు చేసినవారు తరిస్తారు అని శాస్త్రం.యుగాది రోజున తప్పక చేయవలసిన పనులు: 1) సూర్యోదయానికి ముందు లేచి నలుగుతో ఒళ్ళు అంతా వ్రాసుకుని అభ్యంగన స్నానం, 2) ఇష్టదేవతారాధనతో పాటు తప్పక లక్ష్మీదేవి పూజ, 3) శ్రీసూక్తం పారాయణం చేయడం లేక వినడం, 4) రుద్రాభిషేకం, 5) వేపపూతతో చేసిన షడ్రుచుల పచ్చడిని రుద్రుడికి లేదా విష్ణువుకి నైవేద్యంగా పెట్టి గురుదేవులను, నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించడం, 5) ఆలయదర్శనం, 6) సూర్యుడు అస్తమించే లోపు పంచాంగశ్రవణం, 7) అన్నదానం, 8) గురుదర్శనం, 9) గురుప్రదక్షిణ, 10) వ్యాస భగవానుడి కథ వినడం, 11) సంధ్యాసమయంలో లక్ష్మీదేవికి దీపారాధన లేదా దీప దర్శనం, 12) గోప్రదక్షిణ మఱియు గోపూజ,13) పురాణశ్రవణం 14) మత్స్య మరియు స్కాంద పురాణములు గురువులకి దానం ఇవ్వడం వంటివి అన్నీ చేయడం ఎంతో ఉత్తమం మరియు సకలశుభప్రదం.
శ్రీ సూక్తం 👉https://youtu.be/QBQNDt0i-_8?si=TlRBOoMGHFP5YfPo
పంచాంగ పఠనం* 👉 https://youtu.be/CWfotMzr0zY?si=c-U5GjlDsH6a6WCY
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial