March 19 2024మార్చి 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 19 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: దశమి 20వ తేదీ తె.  3.03 కు తదుపరి ఏకాదశి
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు రా.  10.57 కు తదుపరి పుష్యమి
యోగం: శోభన సా.  04.37 కు తదుపరి అతిగండ
కరణం: తైతుల ఉ.  11.31 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.46 - 09.34 కు & రా. 11.12 - 12.00 కు
వర్జ్యం: ఉ. 10.23 - 12.03 కు
అమృతకాలం: రా. 08.21 - 10.01 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు

గురుబోధ:
•	సువర్ణదానం చేసినవాళ్ళు ఐశ్వర్యవంతుల ఇళ్లల్లో పుడతారు.
•	ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసేభాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్యప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక జపం, పారాయణం, పురాణశ్రవణంతో కాలం గడపాలి.  

expand_less