March 18 2023మార్చి 18 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 18 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : ఏకాదశి ఉ.. 08గం౹౹38ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం :  శ్రవణం రా. 10గం౹౹31ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : శివ  రా. 11గం౹౹54ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  బాలవ  ఉ. 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹11ని౹౹ నుండి 07గం౹౹48ని౹౹ వరకు
వర్జ్యం : రా. 02గం౹౹14ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹51ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹11ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

👉🕉️ఏకాదశి🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఆదివారం ఉదయం 6 గం. 12 ని.ల లోపు చెయ్యాలి.

 గురుబోధ :-
లింగోద్భవకాలంలో అబద్ధసాక్ష్యం చెప్పిన బ్రహ్మ తలను గిల్లడం వల్ల  కాలభైరవుడికి  ఆ బ్రహ్మకపాలం చేతికి అంటుకున్నది. అది కాశీలోపడి దొర్లుతూ బదరీ నారాయణుని పాదసన్నిధి  అలకనందాతీరంలో పడింది. ఆదే బ్రహ్మకపాలక్షేత్రం. బదరీక్షేత్రంలో చేసే దాన,జప,తపాలు చేస్తే కోటానుకోట్ల సం.లు తపస్సు చేసిన ఫలం ఇస్తాయి. 

త్రిభాషామహాసహస్రావధాని, పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా 
హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

expand_less