కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 17 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి ఉ.8.11 కు తదుపరి చతుర్దశి 18 ఉ.7.53 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శతభిషం 18 తె.5.40 కు తదుపరి పూర్వాభాద్ర 19 తె.5.35 కు
యోగం: సాధ్య ఉ.6:21 కు తదుపరి శుభ 18 తె.4:01 కు
కరణం: విష్టి రా.8:59 కు తదుపరి చతుష్పాద 19 రా.7:43 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.49 - 9.37 కు, రా. 11.11 - 12.00 కు
వర్జ్యం: మ.12.35 - 2.13 కు
అమృతకాలం: రా. 11.00 - 12.35 కు
సూర్యోదయం: ఉ. 6.26 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
🕉️ మాసశివరాత్రి, అంగారక చతుర్దశి 🕉️
గురుబోధ:
◆ ఫాల్గున మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి ఫాల్గునమాసాన్ని సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందుదాము.
◆ చతుర్దశీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారకచతుర్దశి లేదా భౌమచతుర్దశి అంటారు. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial