కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 17 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం
తిథి: అష్టమి రా. 2.23 కు తదుపరి నవమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మృగశిర రా. 9.16 కు తదుపరి ఆర్ద్ర
యోగం: ఆయుష్మాన్ సా. 05.06 కు తదుపరి సౌభాగ్య
కరణం: విష్టి ఉ. 08.40 కు తదుపరి బవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.50 - 05.38 కు
వర్జ్యం: తె. 5.52 - 7.22 కు
అమృతకాలం: మ. 12.18 - 1.54 కు
సూర్యోదయం: ఉ. 6.22 కు
సూర్యాస్తమయం: సా. 6.26 కు
గురుబోధ:
ఫాల్గుణ శుక్లాష్టమినాడు అమ్మవారు పార్వతీరూపంలో, ఫాల్గుణ కృష్ణాష్టమినాడు శీతలాదేవిగా సంచరిస్తుంది.
కాలభైరవుడికి అష్టమి, అమావాస్య, ఆదివారం, బుధవారం అంటే ఎంతో ప్రీతి. ఆరోజు కాలభైరవుని అర్చిస్తే విశేషానుగ్రహం లభిస్తుంది.
శ్రీ కాలభైరవాష్టకం👇