March 16 2024మార్చి 16 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 16 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: సప్తమి రా.  2.48 కు తదుపరి అష్టమి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రోహిణి రా.  9.09 కు తదుపరి మృగశిర
యోగం: ప్రీతి సా.  06.08 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: గరజి ఉ.  08.48 కు తదుపరి వణిజ
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.  06.23 - 08.00 కు
వర్జ్యం: మ.  1.15 - 2.50 కు & రా.  2.46 - 4.23 కు
అమృతకాలం: సా.  5.52 - 7.26 కు
సూర్యోదయం: ఉ.  6.23 కు
సూర్యాస్తమయం: సా.  6.26 కు

గురుబోధ:
అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహ్యమ్ | ఏవం బ్రువాణ స్సతతం కాశీవాస ఫలం లభేత్ ||
•	నేను కాశీకి వెళుతున్నాను అక్కడే ఉంటాను అని మనస్సులో సదా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు కాశీ వాసం చేసిన ఫలితాన్ని పొందుతారు - శ్రీ కాశీ ఖండం, శ్రీ స్కాందపురాణము
•	కాశీలో గురుపూజ చేసిన వాళ్ళకి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.

expand_less