కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 16 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం తిథి: సప్తమి రా. 2.48 కు తదుపరి అష్టమి వారం: స్థిరవారము (శనివారం) నక్షత్రం: రోహిణి రా. 9.09 కు తదుపరి మృగశిర యోగం: ప్రీతి సా. 06.08 కు తదుపరి ఆయుష్మాన్ కరణం: గరజి ఉ. 08.48 కు తదుపరి వణిజ రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు దుర్ముహూర్తం: ఉ. 06.23 - 08.00 కు వర్జ్యం: మ. 1.15 - 2.50 కు & రా. 2.46 - 4.23 కు అమృతకాలం: సా. 5.52 - 7.26 కు సూర్యోదయం: ఉ. 6.23 కు సూర్యాస్తమయం: సా. 6.26 కు గురుబోధ: అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహ్యమ్ | ఏవం బ్రువాణ స్సతతం కాశీవాస ఫలం లభేత్ || • నేను కాశీకి వెళుతున్నాను అక్కడే ఉంటాను అని మనస్సులో సదా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు కాశీ వాసం చేసిన ఫలితాన్ని పొందుతారు - శ్రీ కాశీ ఖండం, శ్రీ స్కాందపురాణము • కాశీలో గురుపూజ చేసిన వాళ్ళకి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.