March 16 2023మార్చి 16 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 16 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : నవమి మ. 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతి వారం (గురువారం)
నక్షత్రం :  పూర్వాషాఢ రా. 01గం౹౹51ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : వ్యతీపాత  ఉ. 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  గరజి  సా. 04గం౹౹39ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹13ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు & మ.  02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹21ని౹౹ నుండి 01గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹22ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹13ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు


 గురుబోధ :-
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా 
హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

expand_less