కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 15 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి ఉ.7.16 కు తదుపరి ద్వాదశి 16 ఉ.7.58 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శ్రవణం 16 తె.4.24 కు తదుపరి ధనిష్ఠ 17 తె.5.17 కు
యోగం: శివ ఉ.9:36 కు తదుపరి సిద్ధ 16 ఉ.8:14 కు
కరణం: కౌలవ రా.9:34 కు తదుపరి గరజి 16 రా.9:37 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.46 - 5.34 కు
వర్జ్యం: ఉ.7.15 - 8.56 కు
అమృతకాలం: సా. 07.02 - 08.42 కు
సూర్యోదయం: ఉ. 6.27 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
🕉️ ఏకాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.
గురుబోధ:
తులసి, బ్రాహ్మణుడు, గోవు, విష్ణువు, ఏకాదశీ వ్రతం- ఈ ఐదు సంసారసాగరం నుండి బయటపడవేస్తాయి.
- శ్రీ గరుడపురాణం(ధర్మకాండము)
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial