March 15 2023మార్చి 15 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 15 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : అష్టమి మ. 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం :  మూల (16) తెల్లవారి 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : సిద్ధి  మ. 12గం౹౹53ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  బాలవ  ఉ. 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹49ని౹౹ నుండి 12గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹12ని౹౹ నుండి 01గం౹౹43ని౹౹ వరకు & రా. 01గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹18ని౹౹ నుండి 10గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹14ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

 గురుబోధ :-
అమ్మవారు ఫాల్గుణ కృష్ణాష్టమి నాడు శీతలాదేవి గా సంచరిస్తుంది. ఈ రోజు అమ్మవారిని భక్తితో పుష్పాలతో, కుంకుమతో పూజించి అన్న నైవేద్యం తో సంతృప్తిపరచాలి. బహుళాష్టమినాడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి. అలా చేసిన వారికి ఎంత కష్టమైన పని అయినా ఆరునెలలులోగా పూర్తి అవుతుంది. క్లిష్టకార్యాలు పూర్తి చేసుకోవడానికి ఇంతకు మించిన సులభోపాయం మరొకటి లేదు. 

శ్లో ||  	శీతలే ! త్వం జగన్మాతా, శీతలే ! త్వం జగత్పితా | 
		శీతలే ! త్వం జగద్ధాత్రీ, శీతలాయై నమోనమః || 

	శ్లో || 	వందేహం శీతలాదేవీం, రాసభస్థాం దిగంబరామ్ |
		మార్జనీ కలశోపేతాం విస్ఫోటక వినాశనీమ్ ||

త్రిభాషామహాసహస్రావధాని, పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా 
హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

expand_less