కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 14 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి 15 ఉ.7.16 కు తదుపరి ద్వాదశి 16 ఉ.7.58 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ 15 తె.3.02 కు తదుపరి శ్రవణం 16 తె.4.24 కు
యోగం: పరిఘ ఉ.10:25 కు తదుపరి శివ 15 ఉ.9:36 కు
కరణం: బవ రా.8:49 కు తదుపరి కౌలవ 15 రా.9:34 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.03 - 8.51 కు
వర్జ్యం: ఉ.9.48 - 11.32 కు
అమృతకాలం: రా. 09.56 - 11.39 కు
సూర్యోదయం: ఉ. 6.28 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ద్వాదశీ పారణ రేపు చేయాలి.
🕉️ మీన సంక్రమణ, జగద్గురు శ్రీశ్రీశ్రీ కంచి విజయేంద్రసరస్వతీ స్వామి జయంతి, ఏకాదశీ ఉపవాసం 🕉️
గురుబోధ:
🕉️ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=vzHFHMbSXSCS-MsL
శ్రీ వాసుదేవ స్తోత్రమ్👇
https://youtu.be/J658-6zYEPg?si=3TKvNY5qo_HUeqiI
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial