March 14 2024మార్చి 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 14 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: చతుర్థి ఉ.  6.38 కు తదుపరి పంచమి 15వ తేదీ తె 5.02 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: భరణి రా.  10.15 కు తదుపరి కృత్తిక
యోగం: వైధృతి రా.  10.00 కు తదుపరి విష్కంభ
కరణం: బవ మ.  12.20 కు తదుపరి బాలవ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.  10.25 - 11.13 కు & మ.  03.14 - 04.02 కు
వర్జ్యం: ఉ.  8.28 - 10.00 కు
అమృతకాలం: సా.  5.43 - 7.13 కు
సూర్యోదయం: ఉ.  6.25 కు
సూర్యాస్తమయం: సా.  6.26 కు

🕉️ మీనసంక్రమణం 🕉️

గురుబోధ:
నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతా పూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య , సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు  నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచారించే అర్హత కలుగుతుందని శాస్త్రం.

శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) - ఇందులో చతుర్వేదములు, ఉపనిషత్తుల యొక్క సారం నిక్షిప్తమై ఉన్నది. అందుకే ఇది వేదస్తుతి. ఇది విన్నా కూడా మనమే స్వయంగా స్తుతించిన, రచించిన ఫలితం పొందుతాము. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రమణ (సంక్రాంతి) పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇


స్తోత్రం పిడిఎఫ్ (PDF)👇
Sri MahaVishnu Vedastuti ( Galava Muni Krutham )
expand_less