"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చ్ 14 2022🌟
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: ఏకాదశి ఈ రోజు ఉదయం 10గం౹౹36ని౹౹ వరకు తదుపరి ద్వాదశి మంగళవారం ఉదయం 11గం౹౹48ని౹౹ వరకు
వారం : సోమవారం (ఇందువారం)
నక్షత్రం: పుష్యమి రాత్రి 08గం౹౹59ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం: అతిగండ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹05ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹00ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు
👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు (15)ఉదయం 11గం౹౹00ని౹౹లోపు చేయాలి.
గురుబోధ:
ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు తమ నుదుట కుంకుమ, విభూతి లేదా తిలకం తప్పక ధరించాలి. బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండకూడదు.