కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 12 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి 13 తె.4.20 కు తదుపరి దశమి 14 తె.5.57 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మూల రా.11.00 కు తదుపరి పూర్వాషాఢ 13 రా.1.12 కు
యోగం: వ్యతీపాత ఉ.10:31 కు తదుపరి వరీయాన్ 13 ఉ.10:42 కు
కరణం: తైతుల సా.5:27 కు తదుపరి వణిజ 13 రా.7:24 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.27 - 11.14 కు, మ. 3.11 - 3.59 కు
వర్జ్యం: తె.5.20 - ఉ 7.06, రా.9.14 - 11.00 కు
అమృతకాలం: సా. 05.40 - 07.27 కు
సూర్యోదయం: ఉ. 6.30 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
గురుబోధ:
విష్ణ్వాలయంలో 4 సంఖ్య తో ప్రదక్షిణలు (4,8,12,16...) అమ్మవారు మరియు శివాలయంలో 3 సంఖ్య తో ప్రదక్షిణలు (3,6,9,12....) చేయాలని శాస్త్రము. మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను సంరక్షించడం ఎంతో పుణ్యప్రదం. వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడము వల్ల దేవతలు ప్రీతిచెందుతారు. శుభాలు కలిగిస్తారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial