కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 12 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం
తిథి: విదియ ఉ. 10.49 కు తదుపరి తదియ
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: రేవతి రా. 12.38 కు తదుపరి అశ్విని
యోగం: శుక్ల ఉ. 07.53 కు తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ ఉ. 07.13 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.50 - 09.38 కు & రా. 11.13 - 12.01 కు
వర్జ్యం: మ. 1.23 - 2.53 కు
అమృతకాలం: రా. 10.17 - 11.47 కు
సూర్యోదయం: ఉ. 6.26 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కుగురుబోధ:
మంగళచండికా స్తోత్రం - యోగం లేక స్వగృహం విడిచిపెట్టి అద్దె ఇళ్ళలో ఉండేవారు 3 మంగళవారములు ఈ స్తోత్రమును దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో వీలైనన్నిసార్లు పారాయణం చేసుకొని, పుణ్యాత్ములకు యథాశక్తి దక్షిణ ఇస్తే వారి స్వగృహం వారికి తిరిగివస్తుంది. పోయిన ఇల్లు మళ్ళీ కొనుక్కునే శక్తి ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం. ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.
మంగళచండికా స్తోత్రం👇కర్మఫలం, ప్రదక్షిణలు👇