March 12 2023మార్చి 12 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 12 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : పంచమి రా. 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారం (అదివారం)
నక్షత్రం :  స్వాతి ఈ రోజు ఉదయం 06గం౹౹22ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : వ్యాఘాత  సా. 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి 
కరణం :  కౌలవ  ఉ. 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు 
వర్జ్యం : ఉ. 11గం౹౹50ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹12ని౹౹ నుండి 10గం౹౹45ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹15ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹07ని౹౹కు

గురుబోధ: 
 
ఇది అమ్మవారి ధ్యాన శ్లోకం. దీనిని నిత్యం స్మరించడం వల్ల అమ్మవారి  అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా నిద్ర లేమి ఉన్నవారు ఈ శ్లోకం రాత్రి స్మరించడం మంచిదని ఫలశ్రుతి.

శ్లో||
సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యాచ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా
సా2స్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితా2లంకరోతు!
-- శ్రీమద్దేవీభాగవత మాహాత్మ్యం (అధ్యాయం-1)

expand_less