కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 11 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా.2.24 కు తదుపరి నవమి 13 తె.4.20 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.31 కు తదుపరి మూల 12 రా.11.00 కు
యోగం: సిద్ధి ఉ.9:58 కు తదుపరి వ్యతీపాత 12 ఉ.10:31 కు
కరణం: బాలవ మ.3:08 కు తదుపరి తైతుల 12 సా.5:27 కు
రాహుకాలం: మ.12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.02 - 12.49 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.12.07 - 01.54 కు
సూర్యోదయం: ఉ. 6.31 కు
సూర్యాస్తమయం: సా. 6.21 కు
🕉️ శీతలాష్టమి, బుధాష్టమీ పర్వదినం, బుధాష్టమీ వ్రతం🕉️
గురుబోధ:
🕉️ఫాల్గుణశుక్లాష్టమినాడు అమ్మవారు పార్వతీ రూపంలో, ఫాల్గుణ కృష్ణాష్టమి నాడు శీతలాదేవి గా సంచరిస్తుంది. ఈ రెండు అష్టములలోనూ అమ్మవారిని భక్తితో పుష్పాలతో, కుంకుమతో పూజించి అన్న నైవేద్యం తో సంతృప్తిపరచాలి. బహుళాష్టమినాడు ఈ క్రింది శ్లోకాలు పఠించాలి. అలా చేసిన వారికి ఎంత కష్టమైన పని అయినా ఆరునెలలులోగా పూర్తి అవుతుంది. క్లిష్టకార్యాలు పూర్తి చేసుకోవడానికి ఇంతకు మించిన సులభోపాయం మరొకటి లేదు. ఆ శ్లోకాలు ఇవి
శ్లో || శీతలే! త్వం జగన్మాతా, శీతలే! త్వం జగత్పితా | శీతలేత్వం జగద్ధాత్రీ, శీతలాయై నమోనమః ||
శ్లో || వందేహం శీతలాదేవీం, రాసభస్థాం దిగంబరామ్ | మార్జనీ కలశోపేతాం విస్ఫోటక వినాశనీమ్ ||
🕉️బుధవారం నాడు అష్టమీ తిథి వస్తే బుధాష్టమీ పర్వదినము అని శాస్త్రం చెపుతున్నది. సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది. బుధాష్టమీ వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కోర్కెలు నెరవేరుతాయి. ఈ వ్రత విధానము అగ్నిపురాణములో క్లుప్తంగా వివరించారు.
https://youtu.be/U4KPeiHGdlE?si=Bm4XBCR-wL6SNt9w
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial