March 10 2024మార్చి 10 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 10 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం

తిథి: అమావాస్య మ.  3.34 కు తదుపరి పాడ్యమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర తె.  3.45 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: సాధ్య సా.  04.14 కు తదుపరి శుభ
కరణం: నాగ మ.  02.29 కు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.  04.49 - 05.37 కు
వర్జ్యం: ఉ.  11.23 - 12.53 కు
అమృతకాలం: రా.  8.20 - 9.49 కు
సూర్యోదయం: ఉ.  6.28 కు
సూర్యాస్తమయం: సా.  6.25 కు

గురుబోధ:
శనైశ్చర అనుగ్రహం లభించడానికి మరియు నారాయణుని అనుగ్రహం లభించడానికి అమావాస్య నాడు భక్తితో అష్టాక్షరీమంత్ర జపం చేయాలి. అమావాస్యలు, గ్రహణములు ఇలాంటి కాలంలో భక్తితో స్నానము చేసి అష్టాక్షరి వంటి మంత్రాలని జపించేటటువంటి వారికి తిరుగులేని శక్తి లభిస్తుంది.
కాలభైరవుడికి అష్టమి, అమావాస్య, ఆదివారం, బుధవారం అంటే ఎంతో ప్రీతి. ఆరోజు కాలభైరవుని అర్చిస్తే విశేషానుగ్రహం లభిస్తుంది.

శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) - అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇


శ్రీ కాలభైరవాష్టకం👇


expand_less