March 10 2023మార్చి 10 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 10 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : తదియ రా. 08గం౹౹29ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం :  చిత్త (11వ తేదీ) తె. 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి  స్వాతి
యోగం : వృద్ధి  రా. 08గం౹౹40ని౹౹ వరకు తదుపరి ధృవ
కరణం :  వణిజ  ఉ. 09గం౹౹21ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹27ని౹౹ వరకు & మ. 12గం౹౹36ని౹౹ నుండి 01గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹39ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు
అమృతకాలం : రా. 11గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹12ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹17ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹06ని౹౹కు

గురుబోధ: 
శుక్ర, మంగళ, ఆదివారములు  తల స్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్ర వారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.
వేంకటేశ్వరుని వక్షఃస్థలంలో వ్యూహచతుష్టయంతో లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా కొలువై ఉంది. ఈ మంత్రం (ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షః స్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః) ఉత్తమదీక్షతో స్వామి పుష్కరిణి దగ్గర సంకల్పంతో స్నానం, 9 శుక్రవారాలు భక్తిశ్రద్ధలతో స్త్రీపురుషులు చేస్తే, సరైన వారితో వివాహం మరియు అనుకూలదాంపత్యం, భుక్తి, ముక్తి , ఐశ్వర్యము, శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహఫలం కల్గుతుంది. 

expand_less